Gold Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు
బంగారం ధరలు వరుసగా రోజూ పెరగడం, ఎప్పుడో ఒకసారి స్వల్పంగా తగ్గడం అన్నట్లు ట్రెండ్ తయారైంది. మంగళవారం మాత్రం పసిడి కాస్త పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గాయి.
7 types of Gold investment in 2024: ETFs to mining stocks and more
Gold and Silver Rates Today : రేటు తగ్గితే బంగారం కొనుక్కుందామని చూసుకునే వారికి ఇది సరైన సమయం కానట్లే కనిపిస్తోంది. బంగారం రోజుల పాటు పెరగడం, ఎప్పుడో ఒకరోజు స్వల్పంగా తగ్గడం అన్నట్లు ట్రెండ్ నడుస్తోంది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర మంగళవారం రూ. 100 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి ధర ధర నేడు రూ.73,465కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల కూడా పసిడి ధర (Gold Rate) రూ.73,465గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. నగల్ని కొనుక్కునే వారు ఈ ధరలకు తోడుగా జీఎస్టీ, మజూరీల్లాంటి వాటిని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రూ.745 తగ్గడంతో దీని ధర ఇప్పుడు రూ.90,435కి చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు మంగళవారం పెరిగాయి. మంగళవారం ఎనిమిది డాలర్లు పెరిగి 2303 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 29.25 డాలర్లుగా ఉంది.