మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. మరి గోవాలో దేవర ఏం చేస్తున్నాడు?
NTR: ఆచార్యతో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్న కొరటాల శివ.. దేవర సినిమాతో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవరను రెండు భాగాలు తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్‌కి మించిన హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. దేవర మొదటి భాగాన్నీ అక్టోబర్ 10న దసరా కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
దీంతో.. ఈ మధ్యలో వార్ 2కి సంబంధించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు తారక్. ఇక ఇప్పుడు దేవరను కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు. లేటెస్ట్గా దేవర కొత్త షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణం ఆ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. గతంలో కూడా గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు మళ్లీ గోవాలో షూటింగ్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. గోవాలో షూట్ చేస్తున్నారు. అయితే.. ఈ షెడ్యూల్‌తో దేవర షూటింగ్ కంప్లీట్ అవుతుందా? లేదా మరో షెడ్యూల్ ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. దేవర సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి.