ప్రభాస్ నటిస్తునున్న కల్కి 2898ఏడి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు అసలు కంటెంట్ బయటికి రాలేదు. దీంతో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రోజే ట్రైలర్ రిలీజ్ కానుంది. తాజాగా కల్కి ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
'Kalki' trailer muhurtham fix.. What is the run time?
Kalki: ప్రస్తుతం అందరి కళ్లు ‘కల్కి 2898ఏడి’ పైనే ఉన్నాయి. జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ కానుండగా.. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. దేశంలో కొన్ని సెలక్టెడ్ థియేటర్లలో సాయంత్రం 6 గంటలకు కల్కి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే అన్లైన్లో మాత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. దీంతో.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అసలు ఈ ట్రైలర్ ఏ లెవెల్లో ఉంటుంది? సర్ప్రైజ్లు ఏంటి? ముఖ్యంగా విజువల్స్ పరంగా ఎలా ఉంటుందనే? ఆసక్తి అందరిలోను ఉంది. అలాగే.. రన్ టైం ఎంత? అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే.. ఈ ట్రైలర్‌ను నాగ్ అశ్విన్ పీక్స్ అనేలా కట్ చేసినట్టుగా తెలుస్తోంది. 2 నిమిషాల 30 సెకన్ల రన్ టైంతో కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 150 సెకన్ల ట్రైలర్ వెయ్యి కోట్ల బొమ్మను చూపిస్తుందని అంటున్నారు.
అలాగే.. కాస్టింగ్ పరంగా ఈ ట్రైలర్లో ఊహించని సర్ప్రైజ్లు ఉన్నట్టుగా వినిపిస్తుంది. దీంతో.. కల్కి ట్రైలర్ సరికొత్త డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక్కడి నుంచి కల్కి అంచనాలు నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందని అంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. బుజ్జితో ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వస్తే మామూలుగా ఉండదని అంటున్నారు. ఆ తర్వాత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనే ఆసక్తి అందరిలోను ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. కల్కి ఈవెంట్ మామూలుగా ఉండదనే చెప్పాలి.