»Bujji Bhairava Animation Trailer Release From Kalki
Kalki: కల్కి నుంచి ‘బుజ్జి & భైరవ’ యానిమేషన్ ట్రైలర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా యానిమేషన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'Bujji & Bhairava' animation trailer release from Kalki!
Kalki: కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది కల్కి. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులోభాగంగా బుజ్జి కారుని భారీ ఈవెంట్‌తో ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాలో భైరవ కారు పేరు బుజ్జి. దాని పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అందుకే బుజ్జితో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం బుజ్జి చెన్నైలో ఉంది. అక్కడ బుజ్జిని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. కామన్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు సైతం కల్కి కోసం ఎదురు చూస్తున్నాం.. అని అంటున్నారు. ఇక బుజ్జి భైరవను సినిమా రిలీజ్‌కు ముందే ఆడియెన్స్‌కు దగ్గరయ్యేలా యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. మే 31న అమెజాన్ ప్రైమ్‌లో బుజ్జి భైరవ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ యానిమేషన్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక యానిమేషన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. సినిమాటిక్ రేంజ్లో ఈ ట్రైలర్ కట్ చేశారు. భైరవ, బుజ్జిల బాండింగ్ మామూలుగా ఉండదనేలా.. ఈ యాక్షన్ ట్రైలర్ కట్ ఉంది. దీంతో.. సినిమా రిలీజ్‌కు ముందే ఈ యానిమేషన్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. అయితే.. ఈ సిరీస్‌లో చూపించినట్టుగా కల్కి వరల్డ్ ఉంటే మాత్రం.. సినిమా మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈ బుజ్జి కారుకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ హైలెట్‌గా నిలవనుంది. ఏదేమైనా.. సినిమాలాగే ఈ యానిమేషన్ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని అభిమానులు మరింత ఆతృతగా చూస్తున్నారు.