»Actress Anjali Responds To Rumours On Her Wedding
Anjali : సోషల్ మీడియా నాకిప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసేసింది
సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ అంజలి స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..?
Anjali : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కథానాయికల్లో ఒకరిగా అలరించడానికి తెలుగమ్మాయి అంజలి(Anjali) మళ్లీ సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాకి ఇచ్చిన ఇంటర్య్వలో తన పెళ్లి గురించి ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. సోషల్ మీడియా ఇప్పటికే తనకు ఏకంగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేసిందని చెప్పుకొచ్చారు. ఇలాంటివి విన్నప్పుడు తన ఇంట్లో వాళ్లు మొదట్లో కంగారు పడేవారని అన్నారు. అయితే ఆ తర్వాత్తర్వాత వారు వేటినీ నమ్మడం లేదంటూ చెప్పుకొచ్చారు.
అలాంటి గాసిప్స్‌ని(Rumours) విని ఉండటం వల్ల ఇప్పుడు తాను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ‘ఇతన్నే పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పినా వారు నమ్మేట్లు లేరంటూ అంజలి చెప్పుకొచ్చారు. తాను కచ్చితంగా పెళ్లి( Wedding) చేసుకుంటానుకానీ దానికి ఇంకా చాలా సమయం ఉందంటూ నవ్వేశారు. ఒక వేళ పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత కూడా తాను నటిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రస్తుతం అంజలి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అంజలి(Anjali) నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ఈ మే 31న విడుదల కానుంది. దీనిలో ఆమె కథానాయికల్లో ఒకరు. గేమ్ ఛేంజర్‌లోనూ అంజలి పాత్ర ఇలానే ఉంటుంది. అయితే ఆ తర్వాత వచ్చే సినిమాలన్నింటిలోనూ తనది ప్రధాన పాత్రే అని అంజలి చెప్పుకొచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తన పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర సాఫ్ట్‌గా ఉంటుంది. అలా కాకుండా ఆ పాత్ర మాస్‌గా ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో తన పాత్ర అలాంటిదేనని అన్నారు.