ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చివరగా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’, బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఇక అనిరుధ్ ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవల్. అయితే ఈ క్రెడిట్ అంతా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌దే. ఈయన మేకింగ్ చూసి మిగతా మాస్ డైరెక్టర్స్ అంతా ఫిదా అయిపోయారు. అంతేకాదు ఒక్కో సినిమాకు లింక్ పెడుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ 2, విక్రమ్ 2 ప్రకటించేశాడు. కానీ ఇప్పుడు ఇళయ దళపతి విజయ్‌తో 67 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె సంక్రాంతికి వారిసుతో మంచి విజయాన్ని అందుకున్నాడు విజయ్. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. అందుకే లోకేష్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారుమ విజయ్ ఫ్యాన్స్. ఇప్పటికే దళపతి 67 టీమ్ కశ్మీర్‌కు షూటింగ్ వెళ్లిపోయింది. ఈసారి బిగ్ స్టార్ క్యాస్టింగ్ తీసుకున్నాడు లోకేష్. హీరోయిన్గా త్రిష, విలన్‌గా సంజయ్ దత్‌ను తీసుకున్నాడు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా టైటిల్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేశారు. తాజాగా ఓ సాలిడ్ ప్రోమోతో టైటిల్ రివీల్ చేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. దళపతి67కు ‘లియో’ (Leo) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దానికి BLOODY SWEET అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ ప్రోమో అదిరిపోయేలా ఉంది. కశ్మీర్లో విజయ్ ఇనుముని కరిగించి సాలిడ్ కత్తి తయారు చేసి.. దానికి చాక్లెట్ కోటింగ్ ఇచ్చాడు. అతని కోసం విలన్ గ్యాంగ్ భారీ ఎత్తున చుట్టుముడుతున్నట్టు చూపించాడు. ఇక లొకేషన్ అయితే హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా కథ సాలిడ్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో రానుందని చెప్పొచ్చు. అయితే మామూలుగా సింహ రాశిని లియో అని అంటారు. అదే ఇప్పుడు టైటిల్‌గా పెట్టారు. మరి లియో అసలు కథేంటో తెలియాలంటే.. దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.