IPL 2024: చేతులు ఎత్తేసిన సన్ రైజర్స్.. ఫైనల్‌కి చేరుకున్న కోల్‌కతా!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 జరుగుతోంది. అయితే ఈ సీజన్లో క్వాలిఫయర్-1 మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్‌కి జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది.
IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 జరుగుతోంది. అయితే ఈ సీజన్లో క్వాలిఫయర్-1 మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్‌కి జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ ఈ లీగ్‌లో నాలుగోసారి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ స్టార్క్మిచెల్ స్టార్క్(3/34), వరుణ్ చక్రవర్తి(2/26)తో పాటు కేకేఆర్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
కేకేఆర్ స్టార్ పేసర్ స్టార్క్, వైభవ్ అరోరా ఆరంభంలోనే హైదరాబాద్‌ను దెబ్బకొట్టి కోలుకోనీయకుండా చేశారు. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో మాదిరిగానే స్టార్క్ తొలి ఓవర్లో రెండో బంతికే ట్రావిస్ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్లో అరోరా బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (3) క్యాచ్‌ను రస్సెల్ పట్టడంతో నిష్క్రమించాడు. స్టార్క్ ఐదో ఓవర్లో వరుస బంతుల్లో నితీశ్ రెడ్డి (9), షాబాజ్‌ను ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠితో జతకలిసిన క్లాసెన్ (21 బంతుల్లో 32, 3 ఫోర్లు, 1 సిక్స్) .. సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఎస్ఆర్హెచ్ స్కోరుబోర్డు వేగం పుంజుకుంది. వికెట్‌ను కాపాడుకుంటూనే త్రిపాఠి 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ బౌలింగ్ మార్పుగా వచ్చిన వరుణ్ చక్రవర్తి 11వ ఓవర్లో క్లాసెన్‌ను ఔట్ చేయడంతో ఎస్ఆర్హెచ్ పరిస్థితి బాగాలేదు. నరైన్ 14వ ఓవర్లో అబ్దుల్ సమద్ (16)తో సమన్వయ లోపం కారణంగా త్రిపాఠి రనౌట్ అవడంతో పాటు సన్వీర్ సింగ్ డకౌట్ అయ్యాడు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా.. ముందు నుంచే హిట్టింగ్‌కు దిగింది. పవర్ ప్లేలో రెహ్మనుల్లా గుర్బాజ్(14 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సునీల్ నరైన్(16 బంతుల్లో 21, 4 ఫోర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా వారి స్థానాల్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, సారథి శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడారు. ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన వెంకటేశ్, భువీ, కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ బాదుతున్నా కమిన్స్ బౌలర్లను మార్చకపోవడంతో ఈ జోడీ స్వేచ్ఛగా ఆడి అర్ధ శతకాలతో పాటు మ్యాచ్‌నూ ముగించింది. పది ఓవర్లలోనే వంద పరుగుల మార్కును దాటిన కోల్‌కతా మరో 6.2 ఓవర్లు మిగిలుండగానే గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.