»Mother Of Baby Rescued From Sunshade Of Chennai Apartment Dies In Coimbatore
Coimbatore : సన్‌షేడ్‌పై పడిన చిన్నారి వీడియో వైరల్.. ట్రోలింగ్స్‌తో తల్లి ఆత్మహత్య
మూడు వారాల క్రితం ఓ పసిబిడ్డ తల్లి చేతుల్లోంచి పొరపాటున సన్‌షేడ్ మీదికి జారిపడింది. అపార్ట్మెంట్ వాసులు దీన్ని గుర్తించి తెలివిగా బిడ్డని రక్షించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెట్లో ఆ బిడ్డ తల్లిపై తీవ్రంగా ట్రోలింగ్స్ వచ్చాయి. డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.
Coimbatore : సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఓ తల్లి ప్రాణాలు తీసుకోవడానికి కారణం అయ్యాయి. మూడు వారాల క్రితం చెన్నై(Chennai) లోని అపార్ట్మెంట్ నాలుగో అంతస్థు నుంచి బిడ్డ(baby) తల్లి చేతుల్లోంచి జారిపోయింది. ఆ కింద ఉన్న సన్షేడ్ని పట్టుకుని వేలాడుతున్న శిశువును అపార్ట్మెంట్ వాసులు చాకచక్యంగా కాపాడారు. కింద మరికొందరు బిడ్డ కింద పడితే తగలకుండా ఉండేందుకు దుప్పటిని పట్టుకున్నారు. అప్పుడు చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో మూడు వారాలుగా విపరీతంగా వైరల్ అయ్యింది. అందరి హృదయాల్నీ కదిలించి వేసింది.
ఈ వీడియోని చూసిన వారంతా శిశువు తల్లిని దారుణంగా ట్రోల్స్ చేశారు. బిడ్డను చూసుకోవడం రాదా? అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. ఆ ఘటన అనంతరం బిడ్డను(baby) తీసుకుని కోయంబత్తూరులోని(Coimbatore) వారి పుట్టింటికి వెళ్లింది. గత శనివారం ఈ విషయమై మనస్తాపానికి గురైన ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
బిడ్డ తల్లి రమ్య(33) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఆదివారం ఇంట్లో అపస్మారక స్థితితో పడిన ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెల్లారు. కాగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెపై సినీ నటుడు ప్రశాంత్ రంగస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు గాయని చిన్మయి శ్రీపాద ఘాటుగా విమర్శించారు.