మీరు పైన ఫోటోలో చూస్తున్న ఈ కుక్క పేరు బాబీ. ఇది మామూలు కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ వయసు ఉన్న కుక్క ఇది. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30 సంవత్సరాలా 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కల ఆయుష్షు ఉండేదే మా అంటే 10 ఏళ్లు. కొన్ని కుక్కలు 15 ఏళ్ల వరకు బతుకుతాయి. అంతకుమించి అవి బతకలేవు. కానీ.. ఈ కుక్క వయసు 30 ఏళ్లు దాటినా ఇంకా లక్షణంగా ఉంది. అత్యంత ఎక్కువ వయసుతో ఉండి బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు కూడా ఇది క్రియేట్ చేసింది.
ఇదివరకు ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్లోకి ఎక్కింది బాబీ. దీని పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.