మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై మొదటిసారి స్పందించారు.
Devegowda: Devegowda reacts to grandson Prajwal's case
Devegowda: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై మొదటిసారి స్పందించారు. ప్రస్తుతం ప్రజ్వల్ దేశంలో లేడు. అయితే తప్పుచేసిన వాళ్లకి తప్పకుండా శిక్ష పడాలి. ప్రజ్వల్ తప్పు చేశాడని నేరం రుజువైతే చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలి. నష్ట పరిహారం అందించాలి. అయితే రేవణ్నపై వచ్చిన ఆరోపణలపై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని దేవెగౌడ అన్నారు.
ఇదిలా ఉండగా లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్నపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు గురించి హెచ్డి కుమారస్వామి తమ కుటుంబం మొత్తం తరపున మాట్లాడారని దేవెగౌడ అన్నారు. తమ కుటుంబం పరువు తీసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరిగినట్లు అనిపిస్తోందన్నారు. ఈ కుట్రలో చాలామంది ప్రమేయం ఉందని, కానీ వాళ్ల పేర్లు ప్రస్తావించదల్చుకోలేదన్నారు. ఎవరి ప్రమేయం ఉన్నా చట్ట ప్రకారం చర్చలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దేవెగౌడ అన్నారు.