Gold and Silver Rates Today : బంగారం, వెండిని కొనుక్కోవాలని అనుకునే వారు ఎప్పుడూ వీటి రేట్లపై ఓకన్నేసి ఉంచాల్సిందే. అప్పుడే బెస్ట్ రేట్లు ఉన్నప్పుడు వీటిని కొనుక్కోవడానికి వీలవుతుంది. దేశీయ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.915 పెరిగి రూ.75,800కు చేరుకుంది.
ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,800గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి. మనం నగలు కొనుక్కునేప్పుడు ఈ ధరలకు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
కిలో వెండి ధర(Silver Rate) దేశీయ మార్కెట్లలో గురువారం భారీగా పెరిగింది. రూ.1,449 పెరిగి రూ.88,408కు చేరుకుంది. ప్రొద్దుటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి అప్‌ట్రెండ్‌లో ఉండటం గమనించదగ్గ విషయం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఔన్సు బంగారం ధర 2361 డాలర్లుగా ఉండగా, ఔన్సు వెండి ధర 29.55 డాలర్లుగా ఉంది.