ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు గతేడాది నవంబర్లో మంటలు రాజుకున్నాయి. వాటిని ఇంకా నియంత్రించలేదని సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వంపై మండిపడింది.
Uttarakhand Forest: ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు గతేడాది నవంబర్లో మంటలు రాజుకున్నాయి. వాటిని ఇంకా నియంత్రించలేదు. దీనిపై సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వంపై మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వంపై కూడా మండిపడింది. ఈ మంటలు విస్తరించడం వల్ల 1437 హెక్టార్లకు పైగా పచ్చని చెట్లు కాలిపోయాయి. చాలా చెట్లు దగ్ధం అయ్యాయి.. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లంది.
ఈ మంటలను నియంత్రించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 40 శాతంపైగా అడవులు మంటలకి ఆహుతయ్యాయని తెలిపాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు మంటలు లేవని ఉత్తరాఖండ్ తరపు న్యాయవాది తెలిపారు. మంటల నియంత్రణకు 9000 మందికి పైగా పనిచేస్తున్నారని.. కానీ కేంద్రం నుంచి నిధులు అందలేదని తెలిపారు. అడవుల్లో మంటల నియంత్రణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పది కోట్లు డిమాండ్ చేసింది. కానీ కేంద్రం రూ.3.15 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిపై సుప్రీంకోర్టు కోర్టు మండిపడింది.