స్టైలిష్ స్టార్ బన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల బన్ని తన స్నేహితుడు ఎమ్యెల్యే పదవికి పోటీ చేయడంతో మద్దతు ఇవ్వడానికి వెళ్లారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతు ఇవ్వడానికి వెళ్లలేదు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Allu Arjun: తన కెరీర్లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్న హీరో అల్లు అర్జున్ పుష్ప 2కోసం కష్టపడుతున్నాడు. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా ఇదే. ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా చాలా అంచనాలు, భారీ బజ్ ఉన్నాయి. అయితే, వైసీపీ నంద్యాల ఎమ్మెల్యేకి మద్దతుగా వెళ్లడంతో కొంత వివాదానికి దారితీసింది. వ్యక్తిగతంగా అతని ప్రతిష్టను దెబ్బతీసేలా చేసింది.
పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీకి అల్లు అర్జున్ తన మద్దతును ఎలా అందిస్తాడో మనం చాలా సార్లు చూశాం. జులాయి ఆడియో లాంచ్‌లో పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడు లేడని, అతను పవర్ స్టార్‌కి వీరాభిమానిని అని కూడా చెప్పాడు. అయితే గత కొన్నాళ్లుగా బన్నీ మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్‌కి దూరం పాటించడం మొదలుపెట్టాడు. ఇటీవల అతను జనసేన కోసం ట్వీట్ చేశాడు కానీ తన వైసీపీ ఎమ్మెల్యే స్నేహితుడిని కలుసుకున్నాడు. వ్యక్తిగతంగా తన మద్దతును వైసీపీకి తెలిపాడు. ఈ పబ్లిక్ అప్పియరెన్స్ పోస్ట్, తాను ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నాడు.
ఇది మెగా అభిమానులను బాధించడమే కాకుండా తటస్థ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇది మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో బన్నీకి అన్ని వైపుల నుండి హీట్ ఎదురవుతోంది. ఐకాన్ స్టార్ ఎప్పుడూ లేనిది రాంగ్ స్టెప్ వేశాడే.. తనకు తానుగా పెద్ద డ్యామేజ్ చేసుకున్నాడే అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పటికే నాగబాబు కూడా సెటైర్లు వేసేశాడు. మరి, బన్నీ ఏం చేస్తాడో చూడాలి.