»Virat Kohlis Bollywood Son In Law What Did Shahrukh Khan Say About Their Bonding
Shahrukh Khan: కోహ్లీ బాలీవుడ్ అల్లుడు.. వారి బాండింగ్ గురించి షారుక్ ఖాన్ ఏం చెప్పాడంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఇష్టమైన క్రికెటర్ కోహ్లీ అని ఎంత మందికి తెలుసు... అంతేకాదు కోహ్లీ గురించి, అనుష్క గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను షారుక్ పంచుకున్నారు.
Virat Kohli's Bollywood son-in-law.. What did Shahrukh Khan say about their bonding?
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను తను సొంతం చేసుకున్నారు. కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. అంత పెద్ద బిజీ స్టార్ అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటాడు. ఆయన సొంత ఐపీఎల్ టీమ్ కెకెఆర్ స్థాపించి అభిమానులను అలరిస్తుంటాడు. ఇక ఇండియన్ క్రికెటర్లలో షారుక్‌కు ఇష్టమైన వ్యక్తి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎంతమందికి తెలుసు. చాలా సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగానే చెప్పాడు కూడా. తనకు కోహ్లీ ఎంతో ఇష్టమని, అందుకే ఆయన్ను బాలీవుడ్ అల్లుడిగా అభివర్ణిస్తుంటానని షారుఖ్ స్వయంగా చెప్పారు.
మిగితా ఆటగాళ్లతో పోలిస్తే విరాట్‌తో నాకు పరిచయమెక్కువ. తనతో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తాను. అనుష్కతో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు వారి డేటింగ్ గురించి తెలిసిందని చెప్పారు. అంతే కాదు కోహ్లీకి డ్యాన్స్ స్టెప్స్ కూడా నెర్పిస్తారట. ఓ సందర్భంలో జడేజా, కోహ్లీ మైదానంలో స్టెప్స్ వేశారు. అవి అస్సలు బాగలేవని ఆ టైమ్‌లో వారికి కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ నేర్పిస్తా వాటిని ఫాలో అవండి అని చెప్పాను. అని పఠాన్ మూవీ టైటిల్ సాంగ్ డ్యాన్స్ నేర్పించానని వెల్లడించారు. ఇక షారుక్, అనుష్క(Anuska Sharma) కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అందులో మొదటి సినిమా రబ్ నే బనా ది జోడి సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత జబ్ తక్ హై జాన్, ఏ దిల్ హై ముష్కిల్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో వంటి చిత్రాలలో నటించారు.