పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న బన్నీ.. బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకొని తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఇక ఇప్పుడు పుష్ప2 సినిమా కోసం రికార్డ్ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట.
Pushpa 2: ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా.. పుష్ప సినిమాతో నిలిచాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఆగష్టు 15న పుష్ప2 గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు అనుకున్నారు.. కానీ ఇప్పుడది 500 కోట్లకు పెరిగినట్టుగా చెబుతున్నారు. అలాగే.. బన్నీ పారితోషికం కూడా భారీగా పెరిగిందని సమాచారం. పార్ట్ 1కి అందుకున్న దానికంటే డబుల్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి వరకు వంద కోట్లు అందుకుంటున్నాడని వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నట్టుగా సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఇప్పటికే పుష్ప2 బిజినెస్‌తో సంచలనం సృష్టిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఓటిటి డీల్ 275 కోట్ల వరకు జరగ్గా.. హిందీ థియేట్రికల్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా సమాచారం. మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రికార్డ్ రేంజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా వెయ్యి కోట్లు టార్గెట్‌గా రాబోతున్నట్టుగా లెక్కలు వేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లెక్కల మాస్టారు సుకుమార్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా చెక్కుతున్నాడు. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.