కోనసీమ: వీరవల్లిపాలెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత ముద్రగడ వీరేశ్వరరావు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో వీరవల్లిపాలెం సొసైటీ అధ్యక్షుడిగా సూర్యనారాయణ మూర్తి సత్రం చైర్మన్గా ఐదేళ్లపాటు సేవలందించారు. బాజ్జీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సీనియర్ నాయకులు, గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.