అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎందుకు కోపమొచ్చింది? అనేదే ఇప్పుడు అంతు బట్టకుండా ఉంది. కూల్‌గా కనిపించే తారక్‌ను రేర్‌గా సీరియస్ మోడ్‌లో చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో పాటు వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య జరిగే వార్ మామూలుగా ఉండదని ముందు నుంచి చెబుతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
#JrNTR was visibly frustrated over paparazzi capturing him without consent.
రీసెంట్‌గానే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ హోటల్ రూమ్‌లోకి వెళ్తున్న వీడియో ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. అందులో టైగర్‌కు కోపమొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఫొటోగ్రాఫర్లు వెంట పడుతూ ఉండడంతో ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు టైగర్. ఓయ్ అంటూ ఎన్టీఆర్ అరుస్తూ ఉండడం గమనించవచ్చు. దీంతో.. టైగర్‌కి ఎందుకు కోపమొచ్చిందా? అనే చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదని అంటున్నారు.
ఎన్టీఆర్ తన లుక్ లీక్ అవకుండా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తుండడంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్టుగా చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా నార్త్ మీడియా కాస్త ఎన్టీఆర్ పై నెగెటివ్ ప్రచారం చేస్తోంది. ఏదేమైనా.. కూల్‌గా ఉండే ఎన్టీఆర్‌కు కోపం వచ్చిందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.