ముంబై యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్2 షూటింగ్ కోసం రీసెంట్గా ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. నెక్స్ట్ దేవర షూట్లో జాయిన్ అవనున్నాడు.
Devara: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో వార్ 2 షూటింగ్ మొదలు పెట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తోంది. ఇందులో హృతిక్ రోషన్‌తో తలపడనున్నాడు ఎన్టీఆర్.
నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తున్నట్టుగా టాక్ ఉంది. అది కూడా డ్యూయెల్ రోల్ అని అంటున్నారు. దీంతో.. వార్ 2లో ఎన్టీఆర్ విశ్వరూపం చూడబోతున్నామనే చెప్పాలి. మామూలుగానే టైగర్ యాక్టింగ్‌ను తట్టుకోలేం. అలాంటిది విలన్ క్యారెక్టర్ అంటే.. వార్ 2 మామూలుగా ఉండదు. అయితే.. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. అందుకోసం ముంబై వెళ్లగా టైగర్‌కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. అంతేకాదు.. వార్ 2 సెట్స్ నుంచి లీక్ అయిన ఎన్టీఆర్, హృతిక్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్‌ల పై పలు కీలక సీన్స్ తెరకెక్కించింది చిత్రం యూనిట్.
ఇక వార్ 2 లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని.. తిరిగి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు ఎన్టీఆర్. దీంతో దేవర ఈజ్ బ్యాక్ అంటు.. ఎయిర్ పోర్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు అభిమానులు. అయితే.. వార్2తో పాటే మధ్యలో దేవర బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు తారక్. దీంతో.. త్వరలోనే దేవర కొత్త షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. ఆ తర్వాత మళ్లీ వార్2 మొదలు పెట్టనున్నాడు. ఏదేమైనా.. వీలైనంత త్వరగా దేవర, వార్ 2 సినిమాలు పూర్తి చేయనున్నాడు ఎన్టీఆర్.