ఇప్పటి వరకు చూసిన మంచు లక్ష్మీ వేరు.. ఇప్పుడు చూస్తున్న లక్ష్మీ వేరు.. అనేలా రెచ్చిపోతోంది మంచు లక్ష్మీ. హాట్ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. లేటెస్ట్గా కారులో లక్ష్మీ వీడయో చూస్తే.. ఔరా అనాల్సిందే.
Manchu Laxmi: అప్పుడెప్పుడో అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా నటించిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే.. సినిమాలతో పాటు సమాజ సేవ కూడా చేస్తోంది లక్ష్మీ. 2014లో టీచ్ ఫర్ ఛేంజ్‌ను స్థాపించి.. ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్నఈ సంస్థ.. ఇటీవల ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.
ఇక.. యాంకర్‌గా కూడా కొన్ని షోలు చేసింది లక్ష్మీ. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తోంది. అక్కడితో ఆగకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తోంది. ఇలా ఎన్ని రకాలుగా సాధ్యమైతే.. అన్ని రకాలుగా సంపాదిస్తోంది లక్ష్మీ. ఇదిలా ఉంటే.. లక్ష్మక్క కూడా గ్లామర్ షో మొదలెట్టేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లకు తానేమి తక్కువ కాదంటూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.
తాజాగా అదిరిపోయే లుక్‌లో కనిపించి హాట్ టాపిక్ అయిది. రెడ్ డ్రెస్సులో కారులో అదిరిపోయే యాంగిల్స్‌లో పోజులిచ్చింది. థైస్ అందాలతో కిల్లింగ్ పోజులిచ్చింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక.. మంచు లక్ష్మీ సినిమాల విషయానికొస్తే.. అగ్ని నక్షత్రం, ఆది పర్వం అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే.. ఇటీవల ముంబైకి మకాం మార్చింది లక్ష్మీ. ప్రస్తుతం అక్కడ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. ఏదేమైనా.. మంచు లక్ష్మీ మాత్రం తగ్గేదేలే అంటోంది.