tips for face glow in summer : మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో ముఖాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేలిగా ముఖం ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దానికి రక్షణ లేక ఉండా ఎండలోకి వెళ్లడం వల్ల చాలా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి వేసవిలో(summer) ముఖానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఎండలో అయినా, సాయంత్రం పూట అయినా సరే వేసవికాలంలో బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్‌ని ముఖానికి రాసుకోండి. దాని ఎస్పీఎఫ్ కచ్చితంగా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే ఇంట్లో ఉన్నప్పడు తరచుగా చర్మం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. అలా అవుతోంది కదా అని అస్తమానూ ఫేస్ వాష్ చేసేసుకోకూడదు. తరచుగా ఇలా ముఖం కడుక్కుంటూ ఉండటం వల్ల ముఖం(face)పైన ఉండే నూనెలు తొలగిపోతాయి. దీంతో చర్మం పొడి బారిపోతుంది.
ఈ కాలంలో మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటుంది. అలా కాకుండా మేకప్ వేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు గాలిని లోపలికి చొరబడనీయవు. ఫలితంగా మొటిమలు వస్తాయి. ముఖ చర్మంపై పొక్కులు, రంగు మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రోజూ పడుకునే ముందు తప్పకుండా శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. అందువల్ల మురికి, ట్యాక్సిన్లు అన్నీ తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే తగినన్ని నీరు తాగడం కూడా ఈ కాలంలో తప్పనిసరి.