Kalki 2898 Ad : కల్కి రిలీజ్ రూమర్లకు చెక్ పెట్టనున్న మూవీ టీం
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్లకు మూవీ టీం ఫుల్స్టాప్ పెట్టనుంది. ఎలాగంటే...?
Good news for Prabhas fans.. Kalki 2898 AD release date?
Kalki 2898 Ad Release Date : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కీ 2898 ఏడీ(Kalki 2898 Ad) సినిమా విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత ఈ సినిమా వచ్చే మే 9న విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్ పెట్టనుంది.
ఈ విషయమై కల్కి మూవీ టీం గురువారం డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం కానుంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత విడుద తేదీపై(RELEASE DATE) స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ విడుదల తేదీ మరింత ఆలస్యం అయినా కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ డేట్‌ని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ సాయంత్రానికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ – ప్రభాస్(PRABHAS) కంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సంగతి అందరికీ తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించారు. రామాయణం, మహాభారతం లాంటి వాటిని ఆధారణంగా చేసుకుని వేల సంవత్సరాల క్రితం మొదలైన కథకు టైమ్ ట్రావెల్‌ని జోడించి ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె, దిశా పటానీలు నాయికలుగా నటించారు. బిగ్‌బీ అమితాబచ్చన్, కమల్‌హాసన్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో నటించారు.