»The City Of Ayodhya Is Decorated With Splendor For Sri Rama Navami
Sri Rama Navami: శ్రీరామనవమికి వైభవంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరం
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య అత్యంత వైభవంగా ముస్తాబు అవుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు మొత్తం 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
The city of Ayodhya is decorated with splendor for Sri Rama Navami
Sri Rama Navami: ప్రతీఏట జరిగే శ్రీరామ నవమి (Ram Navami) వేడుకల కన్న ఈసారి అత్యంత వైభవంగా జరగనున్నాయి. అందుకోసం శ్రీరాముని జన్మస్థానం అయిన అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతుంది. అయోధ్యరామమందిరం (Ayodhya Ram Mandir) చుట్టు పక్కల ప్రాంతాలు సైతం సర్వాంగ సుందరంగా తయారు అవుతున్నాయి. ఈ సంవత్సరం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఆ వేడుక తరువాత మొదటి శ్రీరామ నవమి కావడంతో రామాలయం ట్రస్టు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే భక్తులందరికి స్వామి వారి దర్శనం కల్పించడానికి గుడి సమయాలు పెంచారు. ఈ మూడు రోజులు ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో 20 గంటల పాటు ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ వేడుకకు సుమారు 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఏడు వరుసల్లో దర్శనం లైన్ పెంచారు. అలాగే ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్, నాగేశ్వరనాథ్ జోన్, హనుమాన్‌గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ ఇలా అన్ని ఏరియాాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. పోలీసు శాఖతోపాటు, నగర ఆరోగ్య శాఖ, అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ బృందాలను మూడు రోజులు పాటు 24 గంటల సర్వీస్‌లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏప్రిల్ 15 నుంచి 18 వరకు రామ్‌లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.