»Mamata Banerjee In West Bengal Anyone Can Come Anything Can Happen You Stay Cool
Mamata Banerjee: ఎవరైనా రావొచ్చు.. ఎదైనా జరగొచ్చు.. మీరు కూల్‌గా ఉండండి
దేశమంత లోక్ సభ ఎన్నికల వేడీ కొనసాగుతుంది. రంజాన్ పర్వదినం సంగర్భంగా పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా దెప్పిపోడించారు.
Mamata Banerjee in West Bengal anyone can come.. anything can happen you stay cool
Mamata Banerjee: అధికారం కోసం ఎవరు ఎంతకైనా తెగిస్తారు అని ఎవరైనా అల్లర్లు చేయడాని వస్తే, మీరంతా నిశబ్ధంగా ఉండాలని, వాళ్లకు మీరు ఎర కావద్దు అని, ప్రశాంతంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ(Mamata Banerjee) పేర్కొన్నారు. ఒకవేళ ఎక్కడైనా పేలుడు జరిగితే, అక్కడ అరెస్టులు చేసేందుకు బీజేపీ ఎన్ఐఏను పంపుతోందని, అందర్నీ అరెస్టు చేస్తే, దేశం నిర్జనంగా మారుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అందరిని అరెస్ట్ చేయడమే వారి లక్ష్యం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. కాదన్న వారిని జైలుకు పంపడం సాధారణ విషయం అయిందని దెప్పిపొడిచారు.
అందరు కలిసి ఒక్కటిగా ఉండే అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చని సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. ఈద్ ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనం అందరం కలిసి జీవిస్తే, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోము అని దీదీ తెలిపారు. లోక్ సభ ఎన్నికల వేళా దేశంలో ఏదైనా జరగొచ్చని తాను అన్నారు. అయితే తన మాటలన్ని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నవే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల బీజేపీ జైలు రాజకీయాలు చేస్తుందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేసీ కవిత ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.