»Janasena Pawan Kalyan Announced Another Mla Candidate
Janasena: మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిని ప్రకటించారు. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అధికారికంగా పవన్ తెలిపారు. పార్టీలోని ముఖ్యమైన వ్యక్తులతో చర్చించి వంశీ పేరును ఫిక్స్ చేశారు. అయితే వంశీ కృష్ణ వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన సంగతి తెలిసిందే.
వైసీపీ నుంచి పోటీ చేయాలని అతను అనుకున్నారు. కానీ టికెట్ ఇవ్వకుండా అధిష్టానం మోసం చేసినందని పార్టీకి రాజీనామా చేసి జనసేనలో కలిశారు. వంశీ కృష్ణకి మంచి పేరు ఉంది. అతని సేవలను గుర్తించి జనసేన వంశీ కోరుకున్న చోట సీటు ఇచ్చింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.