»Lk Advani The President Who Went Home And Was Awarded The Bharat Ratna
LK Advani: ఇంటికి వెళ్లి భారతరత్న అందజేసిన రాష్ట్రపతి ముర్ము
భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి రాష్ట్రపతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ అవార్డు అందజేశారు.
LK Advani: భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి రాష్ట్రపతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ద్రౌపదీ ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో ఆడ్వాణీ జన్మించారు. అక్కడ సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు.
తన పద్నాలుగేళ్ల వయస్సులో 1941లో ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో ఉన్న డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబాయిలో స్థిరపడ్డారు. మొదట రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జన్‌సంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో కౌన్సిల్ ఛైర్మన్‌గా గెలిచారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1980లో వాజ్పేయిూతో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు.