»Son Of Pv Narasimha Rao Who Received The Bharat Ratna Award At The Hands Of President Draupadi Murmu
Bharat Ratna Award: భారతరత్న అవార్డును అందుకున్న పీవీ కుమారుడు
ఈ సంవత్సరం కేంద్రం ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. మరణానంతరం ప్రకటించిన వారి కుటుంబాలకు ఈ అవార్డులను అందజేశారు.
Son of PV Narasimha Rao who received the Bharat Ratna award at the hands of President Draupadi Murmu
Bharat Ratna Award: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనీవారం భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రధానం చేశారు. రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు(PV Narasimha Rao) తరపున ఆయన కొడుకు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు చౌధరీ చరణ్ సింగ్, పీవీ నర్సింహారావు కాగా.. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్(Karpuri Thakur), వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎమ్ఎస్ స్వామినాథన్(MS Swaminathan) ఉన్నారు.
పీవీ తరుఫున ఆయన కుమారడు అవార్డును స్వీకరించారు అనంతరం, మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరీ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రమేశ్‌నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని అద్వాణీకి ప్రదానం చేయాల్సి ఉంది. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నేతలు అద్వాణీ నివాసానికి వెళ్లి అవార్డ్ అందజేయనున్నారు.