»Kcr Kcr Expressed Joy On Announcing Bharat Ratna To Pv
KCR: పీవీకి భారత రత్న ప్రకటించడంపై.. హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్
తెలంగాణ ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి దేశ అత్యున్యత పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
KCR: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి దేశ అత్యున్యత పురస్కారం దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు చేసిందని.. వాటిని గౌరవించి భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ… pic.twitter.com/sKZVLWDd7G
పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు.