»Bharat Ratna To Former Prime Minister Pv Narsimha Rao
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారత రత్న
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం అత్యన్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఆయతో పాటు మరో ఇద్దరికి ఈ పురస్కరాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం మొత్తం ఐదుగురికి భారతరత్న వరించింది.
Bharat Ratna to former Prime Minister PV Narsimha Rao
Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం అత్యన్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి ఈ పురస్కరాన్ని ప్రకటించింది. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ సంవత్సరం మొత్తం ఐదుగురికి భారతరత్న వరించింది. కర్పూరి ఠాకూర్, ఎల్.కె అద్వానీలకు కూడా ఈ పురస్కారం వరించింది. ఒకే సంవత్సరంలో ఐదుగురికి ఇవ్వడం ఇదే తొలిసారి. తెలుగు వ్యక్తికి తొలిసారి భారతరత్న వచ్చింది.
న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) 21 జూన్ 1991 – 16 మే1996 కాలంలో భారతదేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన దేశానికి 9వ ప్రధానిగా చేశారు. ఈ పదవని చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు కావడం విశేషం. తెలంగాణలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న జన్మించారు. లోక్ సభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హోంశాఖా మంత్రిగా, విదేశి వ్వవహారాల శాఖా మంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, ప్రధాని వరకు ఇలా అనేక పదవులను అధిరోహించి తెలుగు వారి గౌరవాన్ని ఢిల్లీ పీఠంపై కూర్చొబెట్టారు. డిసెంబర్ 23, 2004న మరణించారు. ఆయన మరణించిన 20 సంవత్సరాలకు ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది.