తాజ్ మహాల్‌ను హిందూ దేవాలయంగా ప్రకటించాలని తాజాగా మరో పిటిషన్ దాఖలయింది. అక్కడ నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలు నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఏప్రిల్ 9న విచారణ జరగనుంది.
Taj Mahal: ఇప్పటికే అనేక సార్లు తాజ్ మహాల్(Taj Mahal)ను హిందూ దేవలయంగా మార్చాలని కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా మరో ఉత్తరప్రదేశ్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తాజ్ మహాల్ చరిత్ర గురించి మన అందరికీ తెలుసు. ముంతాజ్ బేగం ప్రేమకు గుర్తుగా సాజహాన్ ఆ కట్టడాన్ని నిర్మించారు. ఇప్పటికి అది ప్రేమకు చిహ్నంగానే చూస్తున్నారు. అయితే తాజా పిటిషన్ దారుడు ఆ చోట శివాలయం ఉందని పేర్కొన్నారు. ఆ ప్రదేశాన్ని తేజో మహాలయ(Tejo Mahalaya)గా ప్రకటించాలని కోరుతూ యూపీలోని ఆగ్రా కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం తాజ్ మహాల్లో నిర్వహిస్తున్న అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని పిటిషనర్ కోరడం జరిగింది. దీనిపై ఏప్రిల్ 9న ఆగ్రా కోర్టులో విచారణ జరగనుంది.
యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ దావా దాఖలు చేశారు. ఆ ప్రదేశం తాజ్ మహాల్గా గుర్తించక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందంటూ.. తన వాదనలకు బలం చేకూర్చేలా వివిధ చారిత్రక పుస్తకాలను, ఆధారాలను న్యాయస్థానానికి ఉదహరించారు. దీనిపై విచారణ జరుగనుండగా ఈ అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది వరకు కూడా చాలా సార్లు ఆ ప్రదేశాన్ని హిందూ దేవలయంగా ప్రకటించాలని పలుమార్లు పిటిషన్లు వేశారు. అందులో సరైన ఆధారలు లేని కారణంగా న్యాయస్థానం కొన్నింటిని కొట్టివేయగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.