AKP: రైతులు పండించిన పంటలకు తక్షణం మార్కెట్ సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బిటి.దొర శుక్రవారం డిమాండ్ చేశారు. దేవరాపల్లి సిట్యూ కార్యాలయంలో సమావేశంలో జీడి పంటలకు మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గిట్టుబాటు ధరలు లేక కూలీలకు పనులు దొరకడం లేదన్నారు.