అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ సైతం చేస్తుంది. తాను నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌లో కాస్త రెచ్చిపోయినట్లు కనిపించింది. మొన్నటి వరకు బుద్దిగా ఉన్న ఈ భామ ఇప్పుడు బోల్డ్ కామెంట్స్ సైతం చేస్తుంది. రోమాన్స్ చేయడం అంత ఈజీ కాదు అంటుంది.
Anupama Parameshwar: కళ్లతో మాయ చేసే మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో అలరించి శతమానం భవతితో తెలుగు పరిశ్రమలో హీరోయిన్గా సెటిల్ అయింది. సంప్రదాయమైన దుస్తులతో, చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు టిల్లు స్వేర్ చిత్రంలో లిల్లిగా పలకరించబోతుంది. మార్చి 29 థియేటర్లో రావడానికి ముస్తాబు అవుతుంది ఈ చిత్రం. మూవీ ప్రమోషన్లో పాల్గొన్న పరమేశ్వరన్ బోల్డ్ కామెంట్స్ చేసింది. రోమాన్స్ గురించి మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య చేయాల్సిన రోమాన్స్, వందల మంది ముందు చేసి ప్రేక్షకులను మెప్పించడం అంటే మాములు విషయం కాదు అని అన్నారు. మూవీ ప్రమోషన్లో పాల్గోన్న ఈ భామ ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
టిల్లు స్క్వేర్ చిత్రం తనకు చాలా నేర్పింది అని చెప్పుకొచ్చింది. డీజే టిల్లుకు సీక్వెల్‌గా రూపోందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టిల్లు స్క్వేర్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో.. ఈసారి టిల్లుగాడు చేయబోయే సందడి మామూలుగా ఉండదని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక రన్ టైమ్ కూడా మరీ ఎక్కువగా లేకుండా టీమ్ జాగ్రత్త పడింది. మొత్తం కలిసి రెండు గంటల లోపే ఉండడం గమనార్హం.
#TilluSquare RELEASE TRAILER is coming out TOMORROW!