Madhya Pradesh: నేటి యుగంలో పిల్లలు తమ తల్లిదండ్రులను రక్షించడానికి లేదా వారికి సేవ చేయడానికి బదులుగా వారిని వృద్ధాశ్రమాలలోకి నెట్టి వారి బాధ్యతను విస్మరిస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని వారు జీవితాంతమైనా తీర్చుకోలేరు. వాళ్ల చర్మం ఒలిచి చెప్పుకుట్టించినా తక్కువే. కానీ ఇదే నిజాన్ని ఓ కొడుకు తన తల్లి విషయంలో నిజం చేశాడు. ఒక కొడుకు తన చర్మంతో తయారు చేసిన ఒక జత చెప్పులను తన తల్లికి అందించాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలుగు చూసింది. ఇందులో నేర చరిత్ర ఉన్న వ్యక్తి తల్లికి తన చర్మంతో తయారు చేసిన చెప్పులను కానుకగా అందించాడు. నగరంలోని ధంచా భవన్ ప్రాంతంలో నివసించే రౌనక్ గుర్జార్ పేరుమోసిన రౌడీ షీటర్. ఓ కేసులో నిందితుడైన రౌనక్ కూడా పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. రామాయణంతో తను స్ఫూర్తి పొందాడు. శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు, భక్తితో స్పూర్తి పొందినట్లు ఆయన తెలిపారు. నేను క్రమం తప్పకుండా రామాయణాన్ని పారాయణం చేస్తానని, రాముడి పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసిందని రౌనక్ వెల్లడించారు. దీంతో తన తొడ భాగంలోని కొంత చర్మాన్ని ఉపయోగించ పాదరక్షలను తయారు చేసి తల్లికి బహుమతిగా అందించాడు.
రౌనక్ మాట్లాడుతూ.. రామాయణం చదివాను, రాముడి పాత్ర చాలా ఇంప్రెస్ అయ్యాను, తన తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా తక్కువేనని రాముడు స్వయంగా చెప్పాడు. ఈ ఆలోచన నా మనసులోకి వచ్చింది. నేను నా తోలుతో మా అమ్మ కోసం చెప్పులు తయారు చేసి ఆమెకు అందించాను. కుటుంబంలో ఎవరికీ తెలియకుండా రోనక్ ఆసుపత్రిలో రహస్యంగా శస్త్రచికిత్స చేసి చీలమండపై చర్మాన్ని తొలగించి చెప్పులు కుట్టే వ్యక్తి చేతచెప్పులు తయారు చేయించాడు. అతను తన ఇంట్లో జరిగిన మతపరమైన వేడుకలో ఈ పాదుకలను తల్లికి బహుమతిగా ఇచ్చాడు.
ఐదేళ్ల క్రితం రౌనక్ గుర్జార్ అనే నేరస్థుడు ఉజ్జయిని నగరంలో బీభత్సం సృష్టించాడు. నిజానికి గుర్జర్ గ్యాంగ్ పరస్పర వివాదంలో మోంటు గుర్జార్ అనే వ్యక్తిని కాల్చిచంపారు. పారిపోయిన దుండగులు నగరంలోని కృపా రెస్టారెంట్ యజమాని నుండి విమోచన క్రయధనంగా రూ.50,000 డిమాండ్ చేసి, అతను చెల్లించకపోవడంతో కాల్చి చంపారు. అంతే కాదు రైల్వే స్టేషన్ సమీపంలోని సప్నా స్వీట్స్ మేనేజర్ నుంచి 5 లక్షల రూపాయల విమోచన క్రయధనం కూడా డిమాండ్ చేసి కాల్పులు జరిపారు.