»A Hundred Crore Deal For Ram Charans Game Changer
Ram Charan: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’కు వంద కోట్ల డీల్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను.. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు వంద కోట్ల డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.
A hundred crore deal for Ram Charan's 'Game Changer'?
Ram Charan: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. ట్రిపుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో.. అనౌన్స్మెంట్ నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికైతే.. ఈపాటికే గేమ్ చేంజర్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో ఇండియన్ 2 లైన్లోకి రావడంతో.. గేమ్ చేంజర్ డిలే అవుతు వస్తోంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్‌గానే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. మార్చి 27న చరణ్ బర్త్ డే సండర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు శంకర్. ఇదిలా ఉంటే.. లేటెస్ట్గా గేమ్ చేంజర్ ఓటిటి డీల్ క్లోజ్ అయింది.
ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘గేమ్ చేంజర్’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకునంది. లేటెస్ట్గా జరిగిన స్పెషల్ ఈవెంట్లో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ఆమెజాన్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా సౌత్ ఓటిటి రైట్స్ కోసం ఏకంగా 105 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమా తప్పితే.. చరణ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓటిటి డీల్ అని చెప్పొచ్చు. ఇక హిందీ డిజిటల్ రైట్స్‌ని జీ 5 ఓటిటి ప్లాట్ ఫామ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హిరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.