Gold Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి
బంగారం ధర ఈ వారమంతా ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.67,560 ఉండగా, శనివారం నాటికి రూ.100 తగ్గి రూ.67,460కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,460గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శుక్రవారం రూ.76,090 ఉండగా, శనివారం నాటికి రూ.185 పెరిగి రూ.76,275కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ దాదాపుగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గింది. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2165 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 9 డాలర్లు తగ్గి 2156 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 25.21 డాలర్లుగా ఉంది.