రీసెంట్గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రిలీజ్ అయిది. అయితే ఈ సినిమా విషయంలో విశ్వక్ ఇండైరెక్ట్‌గా ఓ కౌంటర్ వేశాడు. దీంతో రాజమౌళి, మహేష్ బాబును ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విశ్వక్ సేన్ ఏమన్నాడు?
Viswak Sen: టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇతర సినిమాలకు సపోర్ట్ చేయటానికి ఎప్పుడూ ముందే ఉంటారు. సినిమా నచ్చితే చాలు సోషల్ మీడియా ద్వారా అభినందిస్తుంటారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్లకు వచ్చి సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేయడంలో తమ వంతు కృషి చేస్తుంటారు. కానీ ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. విశ్వక్ నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన గామి.. టాలీవుడ్ నుంచి వచ్చిన హాలీవుడ్ రేంజు విజువల్ వండర్ మూవీ అని ప్రశంసలు అందుకుంది. కానీ స్టార్ హీరోలు మాత్రం గామికి పెద్దగా రియాక్ట్ అవలేదు.
సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గెస్ట్‌గా సందీప్ రెడ్డి వంగా రాగా.. ప్రభాస్ వీడియో బైట్‌తో ప్రమోట్ చేశారు. రాజమౌళి కూడా ‘గామి’ ట్రైలర్ చూసిన తర్వాత చిత్ర యూనిట్‌ను అభినందిస్తు ఓ పోస్ట్ పెట్టాడు. కానీ గామి రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ.. ఇదే సమయంలో వచ్చిన ‘ప్రేమలు’ డబ్బింగ్ సినిమాని రాజమౌళి ఓ రేంజ్లో పొగిడేశారు. మహేష్ బాబు ఈ సినిమా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేశానని ఓ పోస్ట్ పెట్టాడు. ఇంకొందరు కూడా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘మా సినిమాని కూడా ఒక నలుగురు పెద్ద మనుషులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే.. ఇది మన తెలుగు సినిమా. నాకు తెలిసి మన తెలుగు నుంచి ఇప్పటివరకు వచ్చి ఇలాంటి సినిమా ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి కొన్ని దశాబ్దాలు తర్వాత అయినా మాట్లాడుకుంటారు.. అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రేమలు సినిమాను పొగిడిన సమయంలో.. విశ్వక్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇండైరెక్ట్‌గా మహేష్, రాజమౌళిని ఉద్దేశించే విశ్వక్ ఈ కామెంట్స్ చేశాడనే టాక్ నడుస్తోంది.