AP High Court: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలు కాకుండా రెండోసారి పత్రాలను దిద్దించి నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు.
దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఎంపిక ప్రక్రియను కూడా 6 వారాల్లో పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.