AP: రాజధాని అమరావతి విషయంలో ధర్మం గెలిచింది- 3 ముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవినీతి, GST అంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 2028 ఆగస్టు కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టంచేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు.