»Passengers Trapped In Mumbai Mauritius Flight For 5 Hours Face Breathing Issues
Flight : విమానంలో శ్వాస ఆడక ఇబ్బంది పడిన ప్రయాణికులు
ముంబయి నుంచి మారిషస్‌కు వెళుతున్న ఎయిర్ మారిషస్ విమానంలో సాంకేతిక లోపాల వల్ల ఏసీలు పని చేయలేదు. దీంతో దానిలో ప్రయాణిస్తున్న పిల్లలు, ఒక వృద్ధుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
Passengers Breathing Problems In Flight : విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వారంతా ఐదుగంటల పాటు విమానంలోనే ఉండిపోయి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏసీలు పని చేయకపోవడంతో ఓ 78 ఏళ్ల వృద్ధుడితో పాటు, చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని హుటాహుటిన కిందికి దింపి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయి నుంచి మారిషస్‌కు వెళ్లాల్సిన ఎయిర్ మారిషస్ విమానం(Mumbai-Mauritius flight) శనివారం తెల్లవారు జామున 4 : 30 గంటలకు ముంబయిలో బయలుదేరాల్సి ఉంది. దీంతో తెల్లవారు జామున 3: 45 నుంచే ప్రయాణికులంతా విమానం ఎక్కారు. అయితే విమానం టేకాఫ్ టైంలో ఇంజిన్‌లో సమస్య ఏర్పండి. దీంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. ప్రయాణికుల్ని కిందికి దింపేందుకు మాత్రం అనుమతించలేదు.
సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు దాదాపుగా ఐదు గంటల పాటు విమానాన్ని అలాగే రన్‌వేపై ఉంచేశారు. అంత సేపు విమానం లోపల ఏసీలు సైతం పని చేయలేదు. దీంతో ఒక 78 ఏళ్ల వృద్ధుడు, పిల్లలు ఊపిరి ఆడక ఇబ్బంది పడిపోయారు. ఇంజన్లో లోపాలను సరి చేసేందుకు విమానయాన సంస్థ ఇంజనీర్లను పిలిపించింది. వారి పరీక్షించినా లోపం సరికాలేదు. దీంతో ఉదయం 10 గంటలకు విమానాన్ని రద్దు చేస్తున్నట్లు కెప్టెన్ ప్రకటించారు.