టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎంత పద్దతిగా ఉంటుందో అంతే హాట్‌గా ఉంటుందని మరోసారి రుజువు చేసుకుంది. తాజాగా తను విడుదల చేసిన బికినీ ఫోటులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి అందరికీ తెలిసిందే. తన మొదటి సినిమా నుంచి చాలా హోమ్లీగా ఉంటూ పద్దతైనా సినిమాలే చేసుకుంటూ వచ్చింది. కాస్త హాట్‌గా కనిపించినా ఎక్కడా హద్దులు మీరలేదు. ఈ మధ్య మాత్రం కాస్త బార్డర్‌ను చెరిపివేసింది. బోల్డ్‌గా నటిస్తుంది. బోల్డ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తనకున్న మయోసైటీస్ కారణంగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఎలాగైనా దాని నుంచి బయట పడాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. అటు మెడిసిన్‌తో పాటు ఇటు ఆయుర్వేధం, ప్రకృతి వైద్యం చేస్తూ ఉపశమనం పొందుతుంది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.
ప్రస్తుతం మలేషియా వెకేషన్లో సమంత అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఒక పూల్‌లో జలకాలాడుతూ సేదతీరుతుంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బికినీలో సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ సిటాడెల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత పెద్దగా సినిమాలు ఓకే చేయలేదు. ఇక చెన్నై స్టోరీస్ అనే చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తుంది. కానీ అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు.