పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సోమవారం విడుదల చేయనున్నారు. 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గతేడాది అర్హులై ఉండి డబ్బులు రాని వారికి ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. చేదోడు పథకంలో చేరాలని భావించే వారు సచివాలయం వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది… అవసరమైన డాక్యుమెంట్లును తీసుకెళ్లాలి, సచివాలయం సిబ్బంది స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి మీకు సహాయ పడతారు… ఇకపోతే గత ఏడాది స్కీమ్ కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది