Tillu scare: భారీ రేటుకు టిల్లు స్కేర్ ఓటీటీ రైట్స్
సిద్దు జొన్నల గడ్డ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా విడుదలకు సంచలనాలను క్రియేట్ చేస్తుంది. త్వరలో థియేటర్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి చిత్రసీమలో పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.
Tillu scare: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ (Tillu sware) సినిమాపై వీపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్ కావడంతో టిల్లు స్వాగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అయితే ఈ సినిమా విడుదల అవకముందు సంచలనాలను క్రియేట్ చేస్తుంది. డిజిటల్ రైట్స్ పరంగా రికార్డు సృష్టిస్తుంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 35 కోట్లకు లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. యంగ్ హీరోకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ రైట్స్ అంటే మాములు విషయం కాదని ఇండస్ట్రీలో టాక్.
యుద దర్శకుడు మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్ విడుదలైంది. ప్రేమికుల రోజు కానుకగా విడుదలై ఈ ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో కూడా టిల్లు స్లాంగ్, ఆ స్వాగ్ అందరికీ కనెక్ట్ అయింది. ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లును తలపించే కొన్ని సన్నివేశాలు కితకితలు పెట్టిస్తున్నాయి. హీరోయిన్ అనుపమతో కూడా కెమిస్ట్రీ కుదిరింది. ఇందులో హీరోయిన్ కూడా చాలా హాట్‌గా కనిపించనుంది. రామ్ మిరియాల పాటలను కంపోజ్ చేశారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.