»Star Hero Who Is Going To Be A Father Samantha Shock
Samantha: తండ్రి కాబోతున్న స్టార్ హీరో.. సమంత షాక్!
అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే స్టార్ హీరోయిన్ సమంత కూడా తల్లి అయి ఉండేది. కానీ పెళ్లిని మున్నాళ్ల ముచ్చటగానే ముగించేసింది సమంత. అయితే.. తాజాగా ఓ స్టార్ హీరో తండ్రి కాబోతున్నానని చెప్పగా.. షాక్ ఇచ్చే రియాక్షన్ ఇచ్చింది సమంత.
Star hero who is going to be a father.. Samantha shock!
Samantha: మొదట్లో అక్కినేని నాగ చైతన్య, సమంత ది బెస్ట్ కపుల్స్ అనిపించుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరు విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. అక్కినేని ఫ్యాన్స్, సమంత అభిమానులు అసలేం జరిగిందో తెలుసుకునే లోపే డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ సమంతను మాత్రం అక్కినేని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు సమంత, నాగ చైతన్య అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏదేమైనా.. చై సామ్ విడిపోకపోయి ఉంటే, ఈ పాటికే తల్లిదండ్రులు అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. దీంతో ఎప్పుడు ఏ హీరో తండ్రి అయినా, ఏ హీరోయిన్ తల్లి అయినా సమంత గురించే చర్చించుకుంటున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడని తెలియడంతో షాకింగ్ రిప్లే ఇచ్చింది సామ్. వరుణ్ ధావన్ తన అభిమానులకు శుభవార్త చెబుతూ.. తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ అనే అమ్మాయిని వరుణ్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. తాజాగా తాము పేరెంట్స్‌గా మారుతున్నామంటూ తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. భార్య నటాషా దలాల్‌తో బేబీ బంప్‌పై వరుణ్ ధావన్ ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో సెలబ్రిటీస్ అంతా వరుణ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. వరుణ్ పోస్ట్‌కు సమంత కాస్త షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఓ మై గాడ్.. బెస్ట్ న్యూస్ అంటూ వరుణ్‌కు కంగ్రాట్స్ చెప్పింది. ఇక వరుణ్, సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందుకే సామ్.. అలా రిప్లే ఇచ్చిందని చెప్పొచ్చు.