వాటర్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మిచెల్.. చివరికీ ఆస్పత్రి పాలయ్యింది. రోజు 4 లీటర్ల నీరు మాత్రమే తీసుకున్న ఆమె.. 12వ రోజు వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చింది.
Water Challenge: ఏదైనా మితంగా తీసుకుంటే ఫర్లేదు.. ఘన పదార్థం లేదంటే ద్రవ పదార్థం అయినా సరే.. అతిగా కలిపితే అన్నం కూడా విషం అవుతుందని అంటారు పెద్దలు. ఇప్పుడు అంతా పోటీ వ్యవస్థ.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఛాలెంజ్‌లు నడుస్తున్నాయి. ఫుడ్, డ్రింక్, చివరికీ వాటర్ ఛాలెంజ్ కూడా కొనసాగుతోంది. కెనడాకు (canada) చెందిన మిచెల్ ఫెయిర్ బర్న్ అనే యువతి ఆ ఛాలెంజ్‌లో పాల్గొని చివరకు ఆస్పత్రి పాలయ్యింది.
మిచెల్ టిక్ టాకర్.. 75 హార్డ్ అనే ఫిట్ నెస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న వారు 75 రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది. బరువు తగ్గించే ఇతర ఆహారం తీసుకోవద్దు. 45 నిమిషాల పాటు వర్కవుట్ చేయాలి. ఏదైనా పుస్తకంలో 10 పేజీలు చదవాలి. రోజూ చేసే కార్యక్రమాలను ఛాలెంజ్ నిర్వాహకులకు పంపించాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్‌లో పాల్గొన్న మిచెల్ రోజుకు 4 లీటర్ల నీరు తాగడం ప్రారంభించారు.
ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఓకే.. 12వ రోజు మాత్రం ఆమె వల్ల కాలేదు. ఆ రోజు తన ఆరోగ్యం సహకరించలేదని మిచెల్ తెలిపారు. రాత్రి మొత్తం బాత్ రూమ్‌లో గడిచిందని.. వికారంగా ఉండటం, తినాలని అనిపించలేదని పేర్కొన్నారు. నీరసంగా ఉండటంతో వైద్యుడిని సంప్రదించానని తెలిపారు. పరీక్షలు చేసిన తర్వాత శరీరంలో సోడియం తగ్గిందని వివరించారు. రోజు అర లీటర్ కంటే తక్కువ నీరు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
రోజూ ఆసుపత్రికి వెళ్తున్నానని వివరించారు. ఛాలెంజ్‌లో ఓటమిని అంగీకరించనని.. మళ్లీ కొనసాగిస్తానని చెబుతున్నారు. వాటర్ ఛాలెంజ్‌ను పోడ్ కాస్టర్ అండ్ సప్లిమెంట్ కంపెనీ సీఈవో ఆండీ ఫ్రిసెల్లా 2019లో ప్రారంభించారు. అప్పటి నుంచి చాలా మంది పాల్గొంటున్నారు. ఈ సారి మిచెల్ పాల్గొని.. ఆస్పత్రి పాలయ్యింది.