Kapil Dev: టీమిండియా ప్లేయర్లకు ఐపీఎలే ముఖ్యం.. సీనియర్లపై మాజీ కెప్టెన్ ఆగ్రహాం
బుమ్రా, రిషబ్ పంత్ జాతీయ జట్టుకు దూరం అవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు నేషనల్ టీమ్‌కు ఆడితే జట్టు పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపారు.
Kapil Dev: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడంతో సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది జట్టు. రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ (kohli) ఎందుకు రెస్ట్ తీసుకున్నారని ఆకాశ్ చోప్రా (akash chopra) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (kapil dev) వంతు వచ్చింది. టీమిండియా ప్రదర్శన గురించి ప్రస్తావిస్తూనే.. కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు గాయాల పేరుతో జట్టుకు దూరంగా ఉండటం సరికాదని అంటున్నారు.
టీమిండియా ప్లేయర్లు అన్నీ తమకే తెలుసు అనుకుంటారని కపిల్ దేవ్ (kapil dev) మండిపడ్డారు. ఎవరినీ సలహా అడగరు అని.. అడగాలని అనుకోరని మండిపడ్డారు. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో కీలకమైన ఆటగాళ్లు లేకపోవడంతో ఆ ప్రభావం జట్టుపై పడుతుంది. అదే చిన్న గాయాలు అయితే ఐపీఎల్లో (ipl) ఆడతారని.. నేషనల్ టీమ్‌కు వచ్చేసరికి ఆడటం లేదని గుర్తుచేశారు. ఏదో కారణం చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారని గుర్తుచేశారు.
గాయం వల్ల ఏడాది నుంచి బుమ్రా (bumrah) జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ వరకు కూడా ఫిట్ కాకుంటే పరిస్థితి ఏంటీ అని కపిల్ దేవ్ (kapil dev) అంటున్నారు. బుమ్రాకు ఏమైంది..? నమ్మకంతో ఆడతాడు.. ప్రపంచ కప్ టోర్నీకి అందుబాటులో లేకుంటే.. అతని కోసం సమయం ఇవ్వడం వృథా అవుతుందని తెలిపారు. రిషబ్ పంత్ (pant) మంచి ప్లేయర్.. అతను ఉన్న పరిస్థితి మరోలా ఉంటేందని కపిల్ (kapil) అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్ టీమ్ మరింత బాగుండేదని తెలిపారు.
ఐపీఎల్ గొప్పదే.. కానీ అందులో ఎక్కువ డబ్బులు వస్తాయని.. ఆటగాళ్లు గాయాలను కూడా లెక్కచేయడం లేదన్నారు. అదే జాతీయ జట్టుకు మాత్రం ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ప్లేయర్స్ వర్క్ ఇవ్వడంలో బీసీసీఐ తీరు కూడా సరిగా లేదని కపిల్ దేవ్ (kapil dev) విమర్శలు గుప్పించారు.