NZB: దివ్యాంగులు సహా పలు వర్గాల ప్రజలకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌ఛార్జి మంద ప్రభాకర్ నేతృత్వంలో మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు పింఛన్‌ను రూ.4,000కి పెంచాలని కోరారు.