సాధారణంగా రైల్వే స్టేషన్ల(Railway stations)లోని ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణకులు నిద్రిస్తూ ఉంటారు. తాము ప్రయాణించాల్సిన రైలు ఆలస్యమైతే కాస్త కునుకు తీయడం సహజం. మహారాష్ట్ర (Maharashtra) పుణెలోని రైల్వేస్టేషన్లో ఓ పోలీసు అధికారి నిర్వాకం నెట్టింట విమర్మలు వెల్లు వెత్తున్నాయి.స్టేషన్లో ప్లాట్‌ఫాంపై నిద్రపోతున్న వారి ముఖాలపై ఓ పోలీసు నీళ్లు జల్లి నిద్రలేపుతున్న వైనం జనాల్ని విస్తుపోయేలా చేస్తోంది. మానవత్వంపై ఏమైందని ఆవేదనతో ప్రశ్నించేలా చేస్తోంది. రూపేన్ చౌదరి (Rupane Chaudhary) అనే నెటిజన్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. మానవత్వం కనుమరుగైందనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు.
పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే మేనేజర్ స్వయంగా స్పందించారు. ‘‘ప్లాట్‌ఫామ్(Platform)పై నిద్రించడం ఇతరులకు అసౌకర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రయాణికులకు సరైన రీతిలో అవగాహన కలిగించాలి. అంతేకానీ, ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఈ సంఘటన తీవ్రంగా బాధించింది’’ అని ఆయన కామెంట్ చేశారు.‘RIP Humanity.పుణె రైల్వే స్టేషన్ ’ అని క్యాప్షన్ ఇచ్చి ఓ నెటిజన్ వీడియో(Netizen video)ను ట్విటర్లో పంచుకున్నారు. ఈ వీడియోకు దాదపు 13,800 లైక్‌లు రాగా.. 3.5 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ సంఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.