హైదరాబాద్ మెట్రో రైలు (Metro train) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రోరైలు అతి తక్కువ టైంలో ఎక్కువ మంది ప్రయాణిికులను ఆకర్షించింది. ప్రస్తుతం మెట్రో రైలు 40 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 28న మెట్రో ప్రారంభం అయింది. ఈ మేరకు మెట్రో రైలు ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి ప్రకటించారు. మెట్రో రైలుకు మంచి ఆదరణ ఉంది. ఎక్కువ మంది మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో నుంచి బయటపడేందుకు జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తున్నారు.
అయితే మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొద్ది రోజుల్లోనే ఐదు లక్షల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య 6.7లక్షలుగా ఉండగా…అత్యధికంగా రోజుకు 1.40లక్షల మంది ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.ఆ తర్వాత విద్యార్థులు రోజుకు 1.20లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి మెట్రోలో విద్యార్థి పాస్ (Metro student pass) ప్రవేశపెడుతూ..నిర్ణయం తీసుకుంది.విద్యార్థుల సౌకర్యార్థం నేటి నుంచి సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023 అమల్లోకి తీసుకువచ్చామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.