»Viral Videowoman Falls Into Drain While Capturing Bride Groom
Woman falls into drain:‘నీ పిచ్చి తగలెయ్య.. ఫోటో కోసం ఆరాటపడి, డ్రైనేజీలో పడ్డ యువతి
పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు ఫోటోలు తీసేందుకు ఓ యువతి ప్రయత్నించింది. అయితే వెనకకు చూడకుండా నడిచింది. డ్రైనేజీలో పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
viral video:Woman falls into drain while capturing bride & groom
Woman falls into drain:ఇప్పుడు పెళ్లి (marriage) అంటే.. హల్దీ (haldi), మెహెందీ (mehendi), సంగీత్ (sangeeth) అంటూ హడావిడి చేస్తున్నారు. ఫోటో (photo), వీడియోలకు (video) ఇచ్చే ప్రయారిటీ వేరు. పెళ్లి కూతురు/పెళ్లి కొడుకు అయితే తినకుండా కూడా ఫోటోలకు (photo) ఫోజులు ఇస్తుంటారు. అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ప్రొఫెషనల్స్ ఫోటో/ వీడియో తీస్తే ఫర్లేదు. కానీ కొందరు కూడా ఫోటోలు తీస్తూ.. ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ యువతికి (women) అలాంటి అనుభవం ఎదురయ్యింది.
పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నడుచుకుంటూ వస్తున్నారు. వారిని కెమెరాలో (camera) బంధించేందుకు యువతి ట్రై చేస్తోంది. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో డ్రైనేజీ (drainage) మీద తారు పోశారు. అక్కడ జాగ్రత్తగా రావాలి. వారిని ఫోటోలు (photos) తీస్తూ అలానే కదిలింది. వెనకకు అడుగులు వేసి, డ్రైనేజీలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. వెంటనే ఆ యువతిని (women) డ్రైన్ నుంచి బయటకు తీశారు. వీడియోను (video) హైదరాబాదీ జాన్ (hyderabadi jaan) అనే పేరుతో ఇన్ స్టలో (instagram) పోస్ట్ చేశారు. ఆ వీడియో (video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 10.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 282 వేల లైకులు కూడా చేశారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.
పాపం ఆమె పెళ్లిని (marriage) షూట్ చేద్దాం అనుకొని.. తానే డ్రైన్లో పడిపోయిందని నెటిజన్లు (netizens) అంటున్నారు. ఇది యూజర్లు (users) నవ్వేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. అక్కడున్న వారంతా పెళ్లిని మరచిపోయి.. ఈ సీన్‌ను (scene) మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటారని చెప్పారు. వీడియో (video) ఫన్నీగా ఉందని కొందరు రాశారు. ఒకరి కష్టాలను చూసి నవ్వడం సరికాదని మరికొందరు రాశారు. ఇలా అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. ఒకరు పడిపోతే నవ్వడం ఏంటీ.. సరికాదు, మనం దిగజారిపోయి ప్రవర్తించడం మంచిది కాదని అంటున్నారు. సోషల్ మీడియా (social media) రెండుగా విడిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే.. ఆ యువతి వెనకాల చూసుకోకుండా డ్రైనేజీలో పడిపోయింది. ఇది బాధ కలిగించే విషయమే. కానీ కొందరు నవ్వడంతో నెట్టింట చర్చకు దారితీసింది.