చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
రాజస్తాన్‌లో గల భరత్‌పూర్‌కు చెందిన మహిళ లక్ష్మీ నివాస్ ప్యాలెస్‌లో ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఆమె చంద్రముఖి వేషధారణలో మెట్రో రైల్ ఎక్కింది. రైలులోకి వచ్చిన ఆమె అరిచారు. సీటు కోసం హల్ చల్ చేశారు. అక్కడున్న వారిని బెదిరించి మరి సీటు తీసుకున్నారు. క్యాజువల్‌గా సీటు అడిగిన ఇచ్చేవారు, కానీ ఆమె ఇలా చేసిందేంటి అని అంటున్నారు. అచ్చం చంద్రముఖిలా రెడీ అయ్యి, అలానే హావభావాలు ప్రదర్శించింది. ఒకతను హెడ్ ఫోన్ పెట్టుకొని పట్టించుకోకున్నా.. అతని వద్దకొచ్చి మరి లేపేసింది.
నోయిడా సెక్టార్ 148 మెట్రో స్టేషన్ వద్ద రైలు వెళుతున్న సమయంలో వీడియో రికార్డైందని కొందరు చెబుతున్నారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. కొందరు ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దృష్టిసారించారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని జర్నలిస్ట్ అతుల్ కృష్ణన్ ట్వీట్ చేశారు. ఆ యువతి మాత్రం అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది.