ప్లాట్‌ఫాంపై నిలిచి ఉన్న ట్రైన్లో కిటికీ బయటనుంచి మొబైల్‌ను దొంగలించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తం అయిన ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకున్నాడు. ట్రైన్ కదిలింది. మిగితావారు కూడా అతని చేయిపట్టుకొని తలపై మొట్టికాయలు వేశారు. ఒక కిలోమీటర్ మేర అతన్ని కిటికీకే వేళాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Viral News A lesson to the thief.. He was hung from the window of a moving train.
Viral News: రైళ్లలో ప్రయాణం చేసే వారు కాస్త అజాగ్రత్తగా ఉన్నా మన వస్తువులకు రాం రాం చెప్పాల్సిందే. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. కదులుతున్న ట్రైన్(train)లో ఓ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగలించే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. అప్రమత్తం అయిన సదరు ప్రయాణికుడు ఆ దొంగ చేయి పట్టుకున్నాడు. ట్రైన్ కదిలింది. మిగితా వారు కూడా అతని చేయి పట్టుకొని తలపై మొట్టికాయలు వేశారు. ఈ ఘటన బీహార్(Bihar)లో జరిగింది.
భాగల్పూర్లో రైలు ప్లాట్‌ఫాంపై ఆగున్న ట్రైన్లో మైబైల్ను కాజేయలనుకున్నాడు. అడ్డంగా దొరికాడు. దీంతో కిటికీ బయట అతడు వేలాడుతూ కిలో మీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. కింద పడిపోతానని భయంతో అరుస్తున్నాడు. రైలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్లాట్‌ఫాంపై ఉన్న మరికొందరు పరిగెత్తుకు వచ్చి అతడిని రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటన ఇక్కడ మొదటి సారి కాదు. గతంలో కూడా మొబైల్ దొంగతనం చేస్తూ దొరికిన దొంగను ఇలాగే 5 కిలోమీటర్లు వేలాడదీశారు.
#Bhagalpur: A thief who snatched a mobile phone from a railway passenger was kept hanging outside the train when he was caught by the passengers present inside the train in Bhagalpur #Bihar.
The passengers sitting inside the train held his hand. The train kept moving and the… pic.twitter.com/CgKiAesr89